తూర్పుగోదావరి జిల్లాలో గల పి.గన్నవరం గ్రామంలో శ్రీ రామారావు, శ్రీమతి రత్నం పుణ్యదంపతుల ప్రధమ సంతానం. జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ (బి.కామ్) వరకు SKBR కళాశాల, అమలాపురం మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఏం.ఏ. పట్టభద్రులు.
1986 సంııలో సరిహద్దు భద్రతా దళంలో సైనికాధికారిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం, 1993వ సంıı నుండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో, వివిధ హోదాలలో, పోలీసు ఉన్నతాధికారిగా ఉద్యోగ బాధ్యతలు.1989 సంııలో పశ్చిమ బెంగాల్లో ప్రప్రధమంగా పూరించిన శంఖారావ నీరాజనం నాటి నుండి నేటికీ కొనసాగుతూనే వున్న నిర్విరామ శంఖారావ ప్రణవనాద రవళి.2009వ సంıı నుండి 2013వ సంıı వరకు ఉద్యోగరీత్యా శ్రీశైలంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వార్ల సన్నిధిలో నిత్య శంఖారావ నీరాజన కైంకర్యం.
“శంఖారావం ప్రతి నాదం మనసును తాకింది. ఆ సంగీతం, ఆ కదలికలు — ఆత్మను ముంచెత్తాయి. నిజంగా ఇది కళకు ఇచ్చిన ప్రాణం.”
హైదరాబాదు
“ప్రతి ప్రదర్శనలో ఉన్న భావన, ప్రతి క్షణంలో ఉన్న ఆత్మీయత... శంఖారావం అనేది కేవలం కళ కాదు, అది ఒక అనుభూతి.”
విశాఖపట్నం
“మన సంప్రదాయాలకు కొత్త ఊపిరి పోసిన శంఖారావం — ప్రతి సారి కొత్త స్ఫూర్తి, కొత్త శాంతి అనుభూతి.”
తిరుపతి
ఆధ్యాత్మికత, కళా వైభవం, మరియు సంస్కృతి ప్రతిధ్వనులు
తేదీ 30 మార్చి 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక "కళారత్న" హంస అవార్డును స్వీకరించిన గౌరవనీయమైన ఘట్టం ఇది. ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల మీదుగా ఆ అవార్డును అందుకోవడం ఒక గౌరవనీయమైన, స్ఫూర్తిదాయకమైన క్షణంగా నిలిచింది.
Read More →
ఈరోజు తేదీ 09.10.2025 నా రాజమండ్రి ఎయిర్పోర్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అఖండ శంఖారావంలో మా దంపతులు సాధించిన విజయపరంపర మాలిక శంఖారావ యు"గళం" పుస్తకాన్ని వారికి అందజేసినప్పటి దృశ్యం.
Read More →
మా (దంపతుల) యు"గళం నుండి అసామాన్య రీతిలో అలవోకగా జాలువారే అఖండ శంఖారావ నీరాజనానికి జేజేలు పలుకుతూ, శ్రీశ్రీ కళావేదిక జనవరి 21న విజయవాడలో మా దంపతులకు ప్రధానం చేసిన విశిష్ట బిరుదు "తెలుగు తేజం" మరియు "జాతీయ ప్రతిభా పురస్కారం" మా కళామతల్లి కంఠంలో పొదిగిన రత్నాల హారంలో మరో కలికితురాయి.
Read More →