సృజనాత్మకత, సాంస్కృతికత మరియు ఆత్మీయతతో నిండిన ప్రయాణం. మేము ప్రతి వేడుకను మరపురాని అనుభూతిగా మలచడానికి కట్టుబడి ఉన్నాం.
తూర్పుగోదావరి జిల్లాలో గల పి.గన్నవరం గ్రామంలో శ్రీ రామారావు, శ్రీమతి రత్నం పుణ్యదంపతుల ప్రధమ సంతానం. జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ (బి.కామ్) వరకు SKBR కళాశాల, అమలాపురం మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఏం.ఏ. పట్టభద్రులు.
1986 సంııలో సరిహద్దు భద్రతా దళంలో సైనికాధికారిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం, 1993వ సంıı నుండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో, వివిధ హోదాలలో, పోలీసు ఉన్నతాధికారిగా ఉద్యోగ బాధ్యతలు.
1989 సంııలో పశ్చిమ బెంగాల్లో ప్రప్రధమంగా పూరించిన శంఖారావ నీరాజనం నాటి నుండి నేటికీ కొనసాగుతూనే వున్న నిర్విరామ శంఖారావ ప్రణవనాద రవళి.
2009వ సంıı నుండి 2013వ సంıı వరకు ఉద్యోగరీత్యా శ్రీశైలంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి వార్ల సన్నిధిలో నిత్య శంఖారావ నీరాజన కైంకర్యం.
శ్రీశైలంలో గల కంచికామకోటి పీఠంలో దసరా, శివరాత్రి ఉత్సవాల సందర్భముగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు, ఉద్ధండులైన పలువురు పండితులు మరియు ఋత్వికుల సమక్షంలో మా దంపతుల అఖండ శంఖానాదం, వారి చేతులమీదుగా ఘన సత్కారం.
కంచికామకోటి పీఠాథిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి వారి సమక్షంలో చాతుర్మాస దీక్ష సందర్భముగా అఖండ శంఖారావం మరియు వారి కరకమలముల మీదుగా సన్మానం, వేద ఆశీర్వచనం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్, మంత్రులు, అతిరథ మహారథుల మరియు వేలాదిమంది భక్తుల సమక్షంలో గోదావరి మరియు కృష్ణా పుష్కరాల ప్రారంభ శంఖారావం...
"ఆంధ్రప్రదేశ్ నూతన ప్రజారాజధాని" శంఖుస్థాపన సందర్భంగా భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి సమక్షంలో అమరావతి శంఖుస్థాపన అఖండ విజయ శంఖారావ దుంధుభి.
పవిత్ర కృష్ణా, గోదావరి నదీ జలాల సంగమం ప్రారంభ వేళ ప్రణవనాద శంఖారావం.
విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ, అమరవీరులకు జోహారులర్పిస్తూ, భారత దేశ రాజధాని ఢిల్లీలో ఇండియాగేట్, ఎర్రకోట, రాజ్ ఘాట్ వద్ద అఖండ శంఖారావ నీరాజనం.
వృత్తిరీత్యా ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రక్షణ దళంలో, విజయవాడ నందు కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఆధ్యాత్మిక వేత్త.
శంఖమే మా ఊపిరి, సర్వస్వం. మాలో ఒక భాగమని, శంఖంతోనే మా దంపతుల జీవితం ముడిపడి ఉందని చెపుతుంటారాయన. వీరి పూరించే శ్రీకరం, శుభకరం అనే శంఖాలు విశిష్టమైన ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
శంఖాన్ని ప్రతినిత్యం పూరించటం, పూజించటం సర్వశుభప్రదమని, శంఖం సాక్షాత్ భగవత్ స్వరూపమని, భగవంతునికి ప్రియనాదం, లక్ష్మీప్రసన్నం, ఐశ్వర్యదాయకం, దివ్యమంగళప్రదాయకం, సర్వశుభాలకు నాందీప్రస్థానం, శంఖారావం విజయానికి సంకేతం.
“శంఖారావం సర్వ శుభప్రదం.”
డాıı కొండా నరసింహ రావు
ఆయన ప్రతిభను గుర్తించి అమెరికాకు చెందిన యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం సంపాదించారు. “శ్రీకరం”, “శుభకరం” అనే శంఖాలు ప్రత్యేక పూజల అనంతరం ప్రసాదించబడినవి.
డాıı కొండా నరసింహ రావు
Cell: 9490959007
Email: nrkonda64@gmail.com